Monday, June 24, 2013

JD LAKSHMINARAYANA gari speech at IMPACT2013

https://www.youtube.com/playlist?feature=edit_ok&list=PLdhvmSCCNY8xqQEu2LFTi5aKelMX2iFNk

ysreddy94hyd's channel

JD LAKSHMINARAYANA gari speeches

  1. 1
    WATCHED

    JD LAKSHMINARAYANA gari speech at IMPACT2013

    by GAMPA NAGESHWER RAO 69,771 views
    IMPACT 2013
    JD LAKSHMINARAYANA…
  2. 2
    WATCHED

    LAKSHMI NARAYANA_CBI DIRECTOR INTERVIEW2_ABN ANDHARA JYOTHI 8th JUNE 2013

    by ysreddy94hyd 36 views
    LAKSHMI NARAYANA_CBI DIRECTOR INTERVIEW2_ABN ANDHARA JYOTHI 8th JUNE 2013
  3. 3

    LAKSHMI NARAYANA_CBI DIRECTOR INTERVIEW_ABN ANDHARA JYOTHI 8th JUNE 2013

    by ysreddy94hyd 33 views
    LAKSHMI NARAYANA_CBI DIRECTOR INTERVIEW_ABN ANDHARA JYOTHI 8th JUNE 2013

DAILY LIVE SUNDAR KAND Pravacham By Sriman Kandadai Swamiji

Thursday, June 20, 2013

BHAKTI RANJANI: VOL-1

BHAKTI RANJANI: VOL-1
FREE DOWNLOAD FOLDER LINK:
http://www.mediafire.com/folder/2bv1m2aapma39/BHAKTI_RANJANI_VOL.1





        



Ayyappa Swamy Bajans in Telugu

Ayyappa Swamy Bajans in Telugu

అయ్యప్ప స్వామి భజనలు – పాటలు

  24. భూత నాధ సదానందా

శో||     భూత నాధ సదానందా
    సర్వ భూత దయాపరా
    రక్ష రక్ష మహభాహో
    శాస్తే తుభ్యం నమోనమః             ..3.. సార్లు  
పల్లవి     భగవాన్‌ శరణం భగవతి శరణం
    శరణం శరణం అయ్యప్పా
    భగవతి శరణం భగవాన్‌ శరణం
    శరణం శరణం అయ్యప్ప
అనుపల్లవి     భగవాన్‌ శరణం భగవతి శరణం     
            దేవనే – దేవియే – దేవియే – దేవనే       ||భగ||
1.    నలుబది దినములు భక్తితో నిన్నే సేవించెదము అయ్యప్పా
    పగలు రేయీ నీ నామస్మరణం స్మరణం శరణం శరణం అయ్యప్పా  ||భగ||     
2.    కరిమల వాసా పాపవినాశ శరణం శరణం అయ్యప్పా
    కరుణతో మమ్ము కావుము స్వామి శరణ&33074; శరణం అయ్యప్పా   ||భగ||
3.    మహిషి సంహార మదగజవాహన శరణం శరణం అయ్యప్పా  
    సుగుణ విలాస సుంధర రూప శరణం శరణం అయ్యప్పా  ||భగ||
4.    నెయ్యాభిషేకం నీకప్పా నీపాద పద్మములు మాకప్పా
    కర్పూర దీపం నీకప్పా నీ జ్యోతి దర్శనం మాకప్పా  ||భగ||

25. కార్తీక మాసము వచ్చిందంటే

కార్తీక మాసము వచ్చిందంటే కలతలుండవయ్యా
నియమాలు నిష్టలు పాటిస్తుంటే నిలకడ వచ్చేనయ్యా
శబరిస్వామివయ్యా నీవు అభయదాతవయ్య
శరణం బంగారయ్య మాపై కరుణ చూపవయ్య     ||కార్తీక||
నొసటి పెడితే చందనము ఇసుక పడితే కుందనము
విబూది పూసిన శరీరం మేదిని నేలే కిరీటం
పంపానదిలో శరణం శరణం స్నానమాడి శరణం శరణం
పంపాలో స్నానమాడి పావనులమై వచ్చాము
స్వామి స్వామి ఇరుముడి తలపైనిడి తరలివచ్చేమయ్యా
పట్టిన దీక్షమాకే పట్టాభిషేకమయ్యా అయ్యప్పాపట్టాభిషేకమయ్యా     ||కార్తీక||
సన్నిధానమున నిలబడి స్వామి శరణం విన్నవించి
హృదయములే పల్లవించి భక్తావేశం పెల్లుబికి
ఒళ్ళు పులకించి కళ్ళు ముకుళించి కైవల్యం కాంచేమయ్యా
ముక్తి సోపానాలు ముట్టినట్లుగ ధన్యత నొందేమయ్య
ఇంతటి గొప్ప పెన్నిధి ఇపుడె సిద్ధించేను అయ్యప్పా ఇపుడె సిద్ధించెను ||కా||

26. అది గదిగో శబరి మలా

అది గదిగో శబరి మలా – అయ్యప్పస్వామి ఉన్న మలా
అది గదిగో పళణి మలా – అయ్యప్ప సోదరుడు ఉన్న మలా
శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ మయ్యప్ప స్వామియే
స్వామియే అయ్యపా – అయ్యప్పా స్వామియె  
అదిగదిగో శబరిమల – శివకేశవులు ఉన్నమల
ఉన్నవారిని లేనివారిని తేడలేనిది శబరిమల
కులమొ మతమొ, జాతి భేదము తేడలేనిది శబరిమల    ||శరణమయ్యప్ప||    
అదిగదిగో పళనిమల శివపార్వతుల ఉన్నమల
కైలాసం వైకుంఠం కలసిఉన్నది శబరిమల
ఈశ్వర హృదయం మాధవనిలయం కలిసిఉన్నది శబరిమల  ||శరణమ||
అదిగదిగో పంపానది, దక్షిణభారత గంగానది
ఈశ్వర కేశవ నందునందుని పాదముకడిగిన పుణ్యనది
అదిగదిగో శబరి పీఠం భక్తజనులకిది ముక్తిపీఠం
శబరిఎంగిలి ఆరగించిన రాముడు నడిచిన పుణ్యస్ధలం
అదిగదిగో కాంతమల అక్కడ వెలువడును మకరజ్యోతి
హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చేదీపమది  ||శరణమ||

27. శబరిమలై నౌక సాగీ పోతున్నది

పల్లవి :     శభరిమలై నౌకా సాగీ పోతున్నది
        అయ్యప్ప నౌక సాగీ పోతున్నది
    నామంబు పలికితే నావ సాగి పోతుంది
    శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
     అందులో చుక్కాని శ్రీ మణి కంఠుడు
    అందులో చుక్కాని శ్రీ భూతనాధుడు
    నామంబు పలికితే నావ సాగి పోతుంది.         ||శరణం||
     తెడ్డెయ్యపని లేదు తెర చాప పని లేదు
    పేదలకు సాదలకు ఇది ఉచితమండీ
    డబ్బిచ్చి ఈ నావా మీ రెక్క లేరు
    నామంబు పలికితే నావ సాగి పోతుంది         ||శరణం||
     కదలండి బాబు మెదలండి బాబు
    అమ్మలారా అయ్యలారా రండి రండి మీరూ
    నామంబు పలికితే నావ సాగిపోతుంది         ||శరణం||    

28. కొండల్లో కొలువున్న కొండదేవరా

పల్లవి     కొండల్లో కొలువున్న కొండదేవరా
    మాకొర్కేలన్ని దీర్చవయ్య కొండదేవరా
1.    కార్తీక మసాన కొండదేవరా
    మేము మాలలే వేస్తాము కొండదేవరా         ||కొం||
2.    అళుదమలై (నది) శిఖరాన కొండదేవరా
    మమ్ము ఆదరించి చూడవయ్య కొండదేవరా     ||కొం||    
3.    కరిమలై శిఖరాన కొండదేవరా
    మమ్ము కరుణించగ రావయ్య కొండదేవరా     ||కొం||
4.    పంపానది తీరాన కొండదేవరా
    మా పాపములను బాపవయ్య కొందడేవరా     ||కొం||
5.    పదునెనెమిది మెట్లెక్కి కొండదేవరా
    మేము పరవశించినామయ్య కొండదేవరా         ||కొం||
6.    నెయ్యాబిషేకమయ్య కొండదేవరా
    నీకు మెండుగా జరిపిస్తాం కొండదేవరా         ||కొం||

29. కొండవాడు మా అయ్యప్పా

పల్లవి     కొండవాడు మా అయ్యప్పా
    జాలి గుండె వాడు మా అయ్యప్పా
    ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా  ..2..    ||కొం||
1.    నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు
    నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు
    నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప
    మణికంఠ నామదేయుడు         ఓహో..    ||కొం||
2.    రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు
    అరుపులే మా పిలుపులు అయ్యప్ప
    శరణాలే మేలుకొలుపులు         ఓహో…    ||కొం||
3.    పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే – చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే
    దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప శరణాలే పలికిస్తాడు  ఓహో..  ||కొం||

30. అయ్యప్ప స్వామినీ చూడాలంటే  

అయ్యప్ప స్వామినీ చూడాలంటే కొండకు వెళ్ళాలి
అయ్యప్ప స్వామినీ చూడలంటే కొండలకు వెళ్ళాలి
శబరి కొండకు వెళ్ళాలి     ||స్వామి||
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
కార్తీకమాసమున మాలలు వేసి పూజలు చేయాలి    ||స్వామి||
యిరుముడికట్టి శరణము చెప్పి యాత్రకు వెళ్ళాలి
శబరి యత్రకు వెళ్ళాలి     ||స్వామి||
ఎరుమేలి వెళ్ళి వేషాలు వేసి పేట ఆడాలి
పేటైసుల్లి ఆడాలి     ||స్వామి||
ఆలుదానదిలో స్నానం చేసి రాళ్ళను తీయాలి
రెండు రాళ్ళను తీయాలి     ||స్వామి||
పంపానదిలో స్నానము చేసి పావనమవ్వాలి
మనము పావనము అవ్వాలి

31. కనివిని ఎరుగుని ఘనయోగం

కనివిని ఎరుగని ఘనయోగం జగము ఎరుగని జపమంత్రం
ఇంద్రియములచే తలవంచి ఇరుముడినే తలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
1.    శ్రీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలినియమం
    ఏకభుక్తమే తింటూ నీకు అర్పణం అంటూ
    ఐహిక భోగం విడిచేది ఐహిక భోగం మరిచేది
    భక్తి ప్రపత్తులు దాటేది శరణమని చాటేది
2.    అపితాహార్యం ఒక నియమం
    సంస్క ృతిక వర్గవమొక నియమం
    అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ
    మమకారములను విడిచేది మదమత్సరములు త్రుంచేది
    కర్మేఫలముగా తలచేది తత్‌త్వమ్‌ అని తెలిచేది.

32.జిందగీమే ఏకబార్‌ శబరియాత్ర

పల్లవి జిందగీమే ఏక్‌బార్‌ శబరియాత్ర ఛలో ఛలో
    హరిహరపుత్ర అయ్యప్పకో దర్శన్‌ కర్‌కే ఆవో
    స్వామియే శరణం అయ్యప్ప స్వామియే
    శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప     ||జిం||
జీవన్‌తో కుచ్‌ బఢానహీ ఉస్‌కా ఛోటాతోపాహై
ఉస్‌కా బేకార్‌ మత్‌ కరో భక్తి, భజన్‌ సే ధ్యాన్‌ కరో     ||జిం||
పాప్‌ సబ్‌ కుచ్‌ మిట్‌ జాతా హై పంపా నదిమే స్నాన్‌ కరో
జ్యోతి స్వరూప్‌కో దర్శన్‌ కో జీవన్‌ ముక్తి మిల్‌తీహై
తుఝె జీవన్‌ ముక్తి హోతా హై             ||జిం||

33. రాజా రాజా పందల రాజ

రాజా రాజా పందల రాజ – నీవు పంబానది తీరాన కీర్తించేవు  ||2||
శరణం అయ్యప్పా శరణం స్వామి – స్వామీ అయ్యప్పా శరణం స్వామి
అన్నదాన ప్రభువా శరణం స్వామి – పొన్నంబలవాసా శరణం స్వామి
అలుద పంబ జలములోన తీపివి నీవే
అడవిలోని జీవాల ఆటవు నీవే
బంగారు కొండపైన వేదము నీవే
పంచగిరులు ధ్వనియించే నాధము నీవే         ||శరణం అయ్యప్పా||
భూతదయను బోధించిన కరుణామూర్తి
భూతనాధ సదానంద శాంతమూర్తి
ఇంద్రియములు జయించినా సుందరమూర్తి
ఇరుముడులను కడతేర్చే దివ్యమూర్తి         ||శరణం అయ్యప్పా||
వావరున్ని వాల్మీకిగ మలచినావయా
వనములోన ఘనముగా నిలిచినావయా
గురుపుత్రుని కరుణించే శ్రీ గురునాధా
మా కన్నియు సమస్త నీవే కాదా         ||శరణం అయ్యప్పా||
తల్లిదండ్రుల పూజించే నీ భావనలూ
గురువులు గౌరవించు నీ సేవలూ
కలియుగమును రక్షించే అభయ హస్తమూ
ఓ తండ్రి నీవేలే మా సమస్తమూ         ||శరణం అయ్యప్పా||

33. అమితానందం పరమానందం

అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపం చూసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా స్వామి అయ్యప్పా – అయ్యప్పా శరణం అయ్యప్పా ||అమితానందం||
హరియే మోహిని రూపం
హరయే మోహన రూపం
హరిహర సంగం అయ్యప్ప జననం
ముద్దులొలుకు సౌందర్యం             ||అమితానందం||
నీవు పుట్టుట పంబా తీరము
నీవు పెరుగుట పందళ రాజ్యము
నీ కంఠమందు మణిహారం
మణికంఠా నీ నామం
పులిపాల్‌ కడవికి ప్రయాణం
మదిలో మహిషి సంహారం
ఇంద్రుడే  వన్‌పులి వాహనం
ఇచ్చెను శబరికి మోక్షము             ||అమితానందం||
ఇరుముడి నీకభిషేకం
పదునెట్టాంబడి ప్రదాయము
మకర సంక్రమణ సంధ్యా సమయం
మకరజ్యోతియే సత్యరూపము             ||అమితానందం||

34. శాస్త్రా సన్నిధిలో అభిషేకం

శాస్త్రా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్తా సన్నిధిలో అభిషేకం
ఆవుపాలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పాలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||     
అవు నెయ్యి తెచ్చినాము అయ్యప్పా-నీకు నెయ్యాభిషేకం అయ్యప్పా  ||శాస్తా||  
పుట్టతేనె తెచ్చినాము అయ్యప్పా-నీకు తెనాబిషేకం అయ్యప్పా      ||శాస్తా||
చందనము తెచ్చినాము అయ్యప్పా-నీకు చందనాభిషేకం అయ్యప్పా ||శాస్తా||    
విభూధి తెచ్చినాము అయ్యప్పా-నీకు భష్మాభిషేకం అయ్యప్పా       ||శాస్తా||    
లిల్లిపూలు తెచ్చినాము అయ్యప్పా-నీకు పూలాభిషేకం అయ్యప్పా      ||శాస్తా||
కర్పూరం తెచ్చినాము అయ్యప్పా-నీకు కర్పూర హారతులు అయ్యప్పా   ||శాస్తా||    

35. గురుస్వామి గురుస్వామి

గురుస్వామి గురుస్వామి – నీకు కోటి కోటి దండాలు గురుస్వామి
నీతోడులేనిదే గురుస్వామి, మేము శబరియాత్ర చేయలేము గురుస్వామి  ||గు||
కార్తీకమాసమున మాలనే వేస్తావు శరణుఘోష మంత్రము నేర్పిస్తావు
అడవిలోన స్వాములకు కష్టము వస్తే అండగా నిలిచి ఆదరిస్తావు         ||గు||
నీవెంటవచ్చే స్వాములకు గురుస్వామి తీసుకొని వెడతావు గురుస్వామి
నీతోడు లేనిదే గురుస్వామి ఇరుముడిని కట్టలేము గురుస్వామి         ||గు||
గురువులేని విద్య విద్యకాదు గురువులేని యాత్ర శబరియత్రకాదు
నీ అనుగ్రహము లేనిదే గురుస్వామి అయ్యప్ప దర్శనము కలగదులే గురుస్వామి  ||గురు||

36. వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే

వీల్లాలి వీల్లాలి వీల్లాలి వీల్లాలే
వీల్లాలి వీరనే వీరమణిగండనే
రాజాది రాజనే రాజకుమారనే
స్వామియే – అయ్యప్పో – శరణమో అయ్యప్పో     ||వీల్లాలి||
ఎరుమేలి చేరినాము – పేటతుల్లి ఆడినాము
వావరుని చూసినాము – వందనాలే చేసినాము
మణికంఠునితో మేము పెద్దదారి నడిచినాము
పాదయాత్ర ఆరంభం – శరణఘోష ప్రారంభం     ||వీల్లాలి||
అక్కడక్కడాగినాము – ఆళందాకు చేరినాము
ఆళుదాలో స్నామాడి – రెండు రాళ్ళు తీసినాము
కఠిన కఠినముకొంటు – కరిమల ఎక్కినాము
ఫరజ్యాసలేదమ – పరమాత్మ నీవయ్య
స్వామియే అయ్యప్పా – శరణమో అయ్యప్పో     ||వీల్లాలి||
శరణఘోష చెప్పుచు – పంపాకు చేరినాము
పంపాలో స్నానమాడి – పాపాలను వదలినాము
శరంగుత్తి చేరినాము – శరణములు గుచ్చినాము
సన్నిధానం చేరినాము – పద్దెనిమిది మెట్లు ఎక్కినాము
అయ్యప్పను చూసినాము – ఆనందం పొందినాము
మరో జ్యాస లేదయ్యా – పరమాత్మ నీవయ్యా
స్వామియే అయ్యప్పో – శరణమొ అయ్యప్పో     ||వీల్లాలి||

37. స్వామియే శరణం శరణమయ్యప్పా

స్వామియే శరణం శరణమయ్యప్పా
శరణం శరణం స్వామి అయ్యప్పా
అమ్మవారు ఉండేది వైకుంఠం – అయ్యవారు ఉండేది కైలాసం
అన్నగారు ఉండేది ఫళనిమలా – మన స్వామి వారు ఉండేది శబరిమలా ||స్వామి||
హరిహర అంటారు అమ్మవారి – హరిహర అంటారు అయ్యవారిని
హరోంహర అంటారు అన్నగారిని – శరణశరణమంటారు స్వామివారిని ||స్వామి||
గరుడ వాహనం అమ్మవారిది – వృషభ వాహనం అయ్యవారిది
పచ్చనెమలి వాహనం అన్నగారిది – వన్‌పులి వాహనం స్వామి వారిది  ||స్వామి||
శ్రీ చక్రధారియే అమ్మవారి – త్రిశూల ధారియే అయ్యవారు
వేలాయుధ పాణివే అన్నగారూ – అభయ హస్తుడే స్వామివారు     ||స్వామి||

38. పళ్ళింకట్టు శబరిమలక్కు కల్లుం ముల్లుం

పళ్ళింకట్టు – శబరిమలక్కు ఇరుముడికట్టు – శబరిమలక్కు
కట్టుంకట్టి – శబరిమలక్కు కల్లుం ముల్లుం – కాలికిమెత్తి
పళ్ళింకట్టు శబరిమలక్కు – కల్లుముల్లుం కాలికిమెతై
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే              ||పళ్ళింకట్టు||
అఖిలాండేశ్వరి అయ్యప్పా – అఖిలచరాచర అయ్యప్పా
హరవోం గురువోం అయ్యప్పా – అశ్రిత వత్సల అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే              ||పళ్ళింకట్టు||
నెయ్యభిషేకం స్వామిక్కే – కర్పూరదీపం స్వామికే
భస్మాభిషేకం స్వామిక్కే – పాలభిషేకం స్వామికే
స్వామియే అయ్యప్పో అయ్యప్పో అయ్యప్పో స్వామియే   ||పళ్ళింకట్టు||
దేహబలందా అయ్యప్పా – పాదబలందా అయ్యప్ప
నినుతిరు సన్నిధి అయ్యప్పా – చేరేదమయ్యా అయ్యప్పా
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే             ||పళ్ళింకట్టు||  
తేనభిషేకం స్వామిక్కే – చందనభిషేకం స్వామిక్కే
పెరుగభిషేకం స్వామిక్కే – పూలభిషేకం స్వామిక్కే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే           ||పళ్ళింకట్టు||  

39. ఉయ్యాల ఊగుచున్నారు

1.    ఉయ్యాల ఊగుచున్నారు, అయ్యప్పస్వామి ఉయ్యాల ఊగుచున్నారు  బంగారు ఉయ్యాల ఊగుచున్నారు
2.    కొండకు కొండ మధ్య మళయాళదేశమయ్యా
    మళయాళదేశం విడిచి ఆడుకొనుచురావయ్యా
3.    విల్లాలివీరుడే నీలమణికంఠుడే
    రాజుకురాజువే పులిపాలు తెచ్చినావే
4.    పంబలో బాలుడే పందళరాజుడే
    కుమారస్వామి తమ్ముడే వావర్‌స్వామి మిత్రుడే
5.    ఎలిమేలిశాస్తావే, అందరికీ దేవుడే
    ముడుపుల ప్రియుడే, శివునికి బాలుడే
6.    కలియుగవరదుడే, కాంతిమలజ్యోతియే
    కారుణ్యశీలుడే కరుణించే దేవుడే

40. నేను నిజమైతే నా స్వామ నిజమౌనా

నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా                ||నేను నిజమైతే||
ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే
ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే
జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే||
పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే
పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే
చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా     ||నేను నిజమైతే||
ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే
ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా     ||నేను నిజమైతే||
భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే
భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా     ||నేను నిజమైతే||

41. కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా

కామాక్షి సుప్రజా స్వామి అయ్యప్పా
భక్తా మనోహరా శరణమయ్యప్పా
దీన దయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయస్వామి అయ్యప్పా     || కామాక్షి సుప్రజా||
హరేరామ హరేరామ స్వామి అయ్యప్పా
హరేకృష్ణ హరేకృష్ణ శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా     || కామాక్షి సుప్రజా ||
శంభో శంకర శంభో శంకర స్వామి అయ్యప్ప
హరోంహరా హరోంహరా శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలాజయస్వామి అయ్యప్పా     ||క్షామాక్షి సుప్రజా||
పంబా వాసా పందళరాజ స్వామి అయ్యప్పా
గౌరీపుత్రా కోమల రూప శరణమయ్యప్పా
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జైజై శంకర బాలా జయ స్వామి అయ్యప్పా     ||క్షామాక్షి సుప్రజా||

42. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా

అన్నదాన ప్రభువే శరణం అయ్యప్పా
అరియాంగవు అయ్యావే శరణమయ్యప్పా    ||అన్న||  
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా     ||శ||
ఏరుమేలి వాసుడవే శరణమయ్యప్పా
ఏకస్వరూపుడవే శరణమయ్యప్పా    ||2||
కరిమల వాసుడవే శరణమయ్యప్పా
కలియుగ వరదుడవే శరణమయ్యప్పా     ||2|| ||అ||
అలుదాని వాసుడే – శరణమయ్యప్ప
ఆదరించు దేవుడవే శరణమయ్యప్ప    ||2||
పంబా నివాసుడవే శరణమయ్యప్ప
పందలారాజవే శరణమయ్యప్ప     ||అన్న||
నీలిమలై వాసుడవే శరణమయ్యప్పా
నిత్యబ్రహ్మచారివే శరణమయ్యప్పా     ||2||
కాంతమలై ఈశుడవే శరణమయ్యప్పా
జ్యోతి స్వరూపడవే శరణమయ్యప్పా    ||2||

43. గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి

గల గల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి     ||2||
ఆడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగల గజ్జలు కట్టినా అయ్యప్ప స్వామి         ||2||
విల్లాలి వీరుడవయ్యా నా అయ్యప్ప స్వామి
వీరమణికంఠుడవయ్యా నా అయ్యప్ప స్వామి
మోహన రూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి
మోహినీ బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల             ||గలగల||       ||2||
పంపా బాలుడవయ్యా నా అయ్యప్ప స్వామి
పందల రాజునువయ్యా నా అయ్యప్ప స్వామి
నీలిమల వాసుడవయ్యా నా అయ్యప్ప స్వామి  
నిత్య బ్రహ్మచారుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి     ||2||
ఈ పూజలు నీకేనయ్య నా అయ్యప్ప స్వామి
ఈ భజనలు నీకేనయ్యా నా అయ్యప్ప స్వామి
పడిపూజలు నీకే నయ్యా నా అయ్యప్ప స్వామి
జ్యోతి స్వరూపుడవయ్యా నా అయ్యప్ప స్వామి
హరి హర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి    ||2||
ఆడుకుందామురావా నా అయ్యప్ప స్వామి
పాడుకుందాము రావా నా అయ్యప్ప స్వామి
హరిహర తనయుడా అందాల బాలుడా
గలగల గలగల గలగల
గలగలగల గజ్జలు కట్టి నా అయ్యప్ప స్వామి    ||2||

44. శరణం శరణం అయ్యప్పా

శో||     శరణం శరణం అయ్యప్పా – స్వామి యే శరణం అయ్యప్పా
    శబరిగిరీశ అయ్యప్పా స్వామి యే శరణం అయ్యప్పా        శర||
1.    సత్యము జ్యోతి వెలుగునయ – నిత్యము దానిని చూడుమయా
    పరుగున మీరురారయ్య – శబరిగిరికి పోవుదుము           శర||
2.    హరి హర మానస సుతులైన – సురలా మొరలను ఆలకించి
    ధరణిలో తాను జన్మించి – పదునాల్గేళ్ళు నివశించి           శర||
3.    ఘోర అడవిలో బాలునిగా – సర్పము నీడలో పవళించి     
    వేటకు వచ్చిన రాజునకు – పసిబాలునిగా కనిపింప          శర||
4.    మణికంఠ అను  నామముతో – పెంచిరి రాజులు మురిపెముగా
    స్వామి మహిమతో రాజునకు-కలిగెను సుతుడు మరియొకడు శర||
5.    గరువాసములో చదివింప – గురుపుత్రుని దీవింప
    మాటలు రానీ బాలునకు మాటలు వచ్చెను మహిమలతో      శర||
6.    మాతాపితలను సేవించి – మహిషిని ఆను వధియించి
    శబరిగిరిలో వెలసిరాగా  – మనలను ధన్యుల చేయుటకు     శర||
7.    అయ్యప్పా అను నామముతో – శిలారూపమున తానున్నా
    జ్యోతి స్వరూప మహిమలతో – భక్తుల కోర్కేలు తీర్తురయ     శర||
8.    మార్గశిరాన మొదలెట్టి – నలుబది దినములు దీక్షతో
    శరణను భజనలు చేయుచు – ఇరుముడి కట్టి పయనింప     శర||
9.    భోగికి ముందు చేరాలి – పంబలో స్నానం చేయాలి
    పదునెట్టాంబడి ఎక్కాలి – స్వామిని మనమూ చూడాలి        శర||
10.    మకర సంక్రాతి దినమున – సాయం సమయం వేళలో
    సర్వం వదలిన సత్పురుషులకు – జ్యోతి దర్శనం మిచ్చునయా  శర||
11.    మకర జ్యోతిని చూడాలి – తిరువాభరణం చూడాలి
    చాలు చాలు మనికింక – వలదు వలదు ఇక మరు జన్మ     శర||
12.    నెయ్యభిషేకం స్వామికే – తేనాబిషేకం స్వామిక్కే
    చందనాభిషేకం స్వామిక్కే – పూలాభిషేకం స్వామిక్కే         శర||
13.    కూర్పరహరతీ తనకెంతో – పాయసమంటే మరియెంతో
    శరణన్న పదములు ఎంతెంతో – యిష్టం యిష్టం స్వామికే     శర||
14.    హరిహరాసనం స్వామిది – సుందర రూపం స్వామిది
    కన్నుల పండుగ మనదేలే – జన్మ తరించుట మనకేలే     శర||
15.    శరణం శరణం అయ్యప్పా – శరణం శరణం శరణమయా
    శరణం శరణం మాస్వామి – దరికి చేర్చుకో మాస్వామీ     శర||  

 45. కొబ్బరికాయలు అయ్యప్పకే

కొబ్బరికాయలు అయ్యప్పకే
కోటి పూజలు అయ్యప్పకే అయ్యప్పకే     ||2||
శబరిమలై మా అయ్యప్పా అయ్యప్పా
నీకు శరణం శరణం అయ్యప్పా అయ్యప్పా     ||2||
ఇరుముడి కట్టుకొని అయ్యప్పో, అయ్యప్పా     ||2||
మేము నీ కొండ కొస్తమయ్యా అయ్యప్పా, అయ్యప్పా     ||2||
ఏరుమేలి కాడ అయ్యప్పా, అయ్యప్పా     ||2||
మేము పేటతుళ్లై ఆడుతాము అయ్యప్పా     ||2||
ఐదు కొండలు దాటి అయ్యప్పా, అయ్యప్పా
మేము తానాలు చేస్తమయ్య అయ్యప్ప అయ్యప్ప
పందళ రాజడవు అయ్యప్పా, అయ్యప్పా
మా పాపాలు తొలగించు అయ్యప్పా అయ్యప్పా
కన్నెమాల గణపతికి అయ్యప్పో అయ్యప్పో
మేము టెంకాయ కొడుతమయ్య అయ్యప్పో అయ్యప్పో    ||కొ||
పద్దెంది మెట్లెక్కి అయ్యప్ప అయ్యప్పా
మేము పరవశించి పోతాము అయ్యప్పా అయ్యప్పా
నెయ్యాభిషేకాలు అయ్యప్పో అయ్యప్పో
నీకు ఘనముగ చేత్తమయ్య అయ్యప్పో అయ్యప్పా
మకర సంక్రాంతి నాడు అయ్యప్పా, అయ్యప్పా
నీ జ్యోతి రూపము చూపుమయ్య అయ్యప్పా అయ్యప్పా     ||కొ||

46. ఎక్కడ చూసిన నీవే అయ్యప్పా

ఎక్కడ చూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా
స్వామి ఎక్కడచూసినా నీవే అయ్యప్పా సర్వంతర్యామీ నీవే అయ్యప్పా
చిగురాకులలో పువ్వులలో నీవే అయ్యప్పా
పసిపాపలోన వృద్దులలోనా నీవే అయ్యప్పా     || స్వామి ఎక్కడ||
గళగళపారే సెలయేరులలో నీవే అయ్యప్పా
గగనానగిరి పకక్షులలోన నీవే అయ్యప్పా         || స్వామి ఎక్కడ||
ఢమఢమ ఢమఢమ ఢమరుక్కనిలో నీవే అయ్యప్పా
ఘణఘణ ఘణఘణ ఘంటానాధం నీవే అయ్యప్పా|| స్వామి ఎక్కడ||
నింగి నేల శూన్యములో నీవే అయ్యప్పా
నీతి జాతి మానవ జాతి నీవే అయ్యప్పా         || స్వామి ఎక్కడ||
కన్నె స్వాములలో కత్తిస్వాములలో నీవే అయ్యప్పా
గంట స్వాములలో గధాస్వాములలో నీవే అయ్యప్పా
గురుస్వాములలో మణికంఠులలో నీవే అయ్యప్పా     || స్వామి ఎక్కడ||

47. సంతసంబు సంతసంబు సంతసంబహో

సంతసంబు సంతసంబు సంతసంబహో
శబరిమలై యాత్రచేయ సంతసంబహో
కార్తికేయ మాసమందు కఠిన నిష్ఠతో
కంఠమాల వేసుకొనగ కలుగు సంతసం     ||సంత||
శరణుఘోషవేడుగొనుచు శబరిమలై కేగగా
ఇరుముడి దాల్చివేగ ఎరిమేలి చేరగా     ||సంత||
ఆటవిక వేషమంది ఆడిపాడగా
దివ్యమైన పంబనదిని తీర్ధమాడగా     ||సంత||
శబరిపీఠమందు చేరి శరము గ్రుచ్చగా
పదెనెట్టాంబడి నెక్కుచు పరవశించగా     ||సంత||   

 48. కన్నెస్వామి ఓ కన్నెస్వామి

కన్నెస్వామి ఓ కన్నెస్వామి
వేయికనులు చాలవులే – మన అయ్యప్పనూచూడ
ఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము
వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము
కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము   ||కన్నెస్వామి||
ఆలుదాకు చేరుకుని – స్నానాలే చేద్దాము
పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము
కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము
శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము    ||కన్నెస్వామి||
కొబ్బరికాయ ఒకటికొట్టి – పద్దెనిమిది మెట్లెక్కి
పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును
ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము
హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము     ||కన్నెస్వామి||  

49. అయ్యా అని పిలిచినా

అయ్యా అని పిలిచినా అప్పా అని కొలిచినా
అభయమిచ్చి బ్రోచేది అయ్యప్పయే అండగా నిలిచేది ఆ తండ్రియే  ||అయ్యా||
శివకేశవ రూపమైన మోహిని పుత్రుని
పంబానది తీరాన వెలసిన బాలుని     ||అయ్యా||
పులిపాలను తెచ్చిన పొన్నంబల వాసుని
తల్లి మనసు మార్చిన శబరిగిరి నాధుని     ||అయ్యా||
మంజుమాత వలచిన మోహనరూపున
కాంతమల జ్యోతిగా వెలుగొందు స్వామిని     ||అయ్యా||
అజ్ఞానపు పొరలను తొలిగించే దేవుని
అందరినీ ప్రేమ మీర కరుణించే మూర్తివి     ||అయ్యా||

50. ఈశ్వర నిలయం కైలాసం

ఈశ్వర నిలయం కైలాసం – కేశవ నిలయం వైకుంఠం
ఈశ్వర కేశవ ప్రియనందనుని సన్నిధానమే శబరిమల     ||ఈశ్వర||
ఆరుముఖముల దేవుడు అయ్యప్ప స్వామికి సహజుడు
సహజుడున్నది పళనిమల తానువున్నది శబరిమల
కడుపావనం ఇల శబరిమల
శబరిమలకే శోభనమూర్తి భక్త స్వాంతముల చిరస్ఫూర్తి
శరణం కోరిన తరుణ జలజమై శుభములు కురిసే మణిమూర్తి
జీవము నొసగే జ్యోతిర్మూర్తి     ||ఈశ్వర||

51. అతి బలవంతా హనుమంతా

అతి బలవంతా హనుమంతా – నీవేలే నా మనసంతా
పరమ పురష ఓ పవనసుతా
రామునికే నిజదూత – శ్రీరామునికే నిజదూత
అమితానందము నీ చరితా – బ్రహ్మనందము నీ ఘనతా
పరమానందము నీ ఘనతా             ||అతిబలవంతా||
ఎక్కడ భజనలు జరిగిన గాని అక్కడ నీవు వుందువట
hindudevotional 1 has invited you to view the following shared folder:

Folder
AYYAPPA BHAKTI SONGS.K.J.YESUDAS and OTHERS_2.15GB_ ZIPPEDFILES

download link:
https://drive.google.com/folderview?id=0B-8fCMz3zodeclFFYl9rdUJWdUE&usp=sharing

నమ్మినబంటువు హనుమంతా            ||అతిబలవంతా||
భూతములు నీ పేర్వినినంతనె – భయముతో పరుగెడు అల్లంతా
శ్రీరామదూత హనుమంతా – మరామ దూత హనుమంతా     ||అతిబలవంతా||
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్‌కి
రామలక్ష్మణ జానకి – జై బోలో హనుమాన్‌కి
జై బోలో హనుమాకి – రామ లక్ష్మణ జానకి  ||జయ||

52. ఏమయా దొర వరాల అంజని

ఏమయా దొర వరాల అంజని కుమారా ఏమయా దొర ||2||
పుట్టగానే పిట్టవలె నింగికెగిరినావట, నింగికెరినావట
నింగికెగిరి సూర్యుణ్ణి మింగ చూసినావట, మింగచూసినావట     ||ఏవయా||
సంజీవిని పర్వతాన్ని చేతపట్టినావట, నీచేత పట్టినావట
పెద్ద పెద్ద కొండలను పిండిచేసినావట, పిండి చేసినావట        ||ఏవయా||
లంకకెళ్ళి సీతకేమో వార్తలందించినావట, వార్తలందించినావట
రాముడందు భక్తి చూపి జ్ఞానివైనావట, జ్ఞానివైనావట        ||ఏవయా||
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి
జై బోలో హనుమానుకి, రామ లక్ష్మణ జానకి

> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

VEDA MANTRAS.mp3

VEDA MANTRAS.mp3

FREE DOWNLOAD FOLDER LINK:
http://www.mediafire.com/folder/q7tgtbr3hb529/VEDA_MANTRAS._mp3http://www.mediafire.com/folder/q7tgtbr3hb529/VEDA_MANTRAS._mp3

GANAMRUTAM_SVBC

GANAMRUTAM_SVBC

Wednesday, June 19, 2013

TIRUPATI VARI BHAJANA YAGNAM


TIRUPATI VARI BHAJANA YAGNAM






                  FREE DOWNLOAD FOLDER LINK:  
                          http://www.mediafire.com/?icdhtpto191tn


SHIVA STUTI_K.J.YESUDAS

నేను సేకరించిన lord  shiva  భక్తీ పాటలు 500 లను ఒక డీవీడీ లో వేసికొని మీరు వినవచ్చును లేదా భక్తులకు గాని లేదా శివాలయం లో గాని ప్లే చేయటానికి గాని ఇవ్వవచ్చును ...total 500 songs are made as zipped files each zipped file contains 20 songs total zipped  files are 24...
the details of songs are shown here in the photos...now u can download them....with this link

https://drive.google.com/folderview?id=0B-8fCMz3zodeNWUya1M2M3FGYnc&usp=sharing

SHIVA STUTI_K.J.YESUDAS

FREE DOWNLOAD LINK:

Indian Temples Abroad

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular